ఏయూ వందేళ్ల వేడుకలు.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమన్న సచిన్

  • ఏయూ వందేళ్ల వేడుకల్లో ప్రసంగించిన సచిన్ టెండూల్కర్
  • తండ్రి ఏకాగ్రత గురించి ఆసక్తికర విషయం పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్
  • సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని గుర్తుచేసుకున్న క్రికెట్ దిగ్గజం
  • నిరంతర సాధనతోనే ఉన్నత స్థాయికి చేరానని వెల్లడి
  • ఒత్తిడిని జయించడంపై యువతకు కీలక సూచనలు
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన జీవితంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను, విజయ రహస్యాలను పంచుకున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తన తండ్రి గురించి చెప్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైందని చెబుతూ ప్రసంగం ప్రారంభించారు.

తాను చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని, మొదట్లో రెండు గదుల ఇంట్లోనే సర్దుకున్నామని సచిన్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి చదువంటే ఎంతో ఇష్టమని, ఆయన ఏకాగ్రత అమోఘమని తెలిపారు. "నేను క్రీడాకారుడిగా నిలదొక్కుకున్నాక కారు కొన్నాను. అందులో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినేవాడిని. ఆ సమయంలో మా నాన్న పుస్తకం చదువుకుంటున్నా, ఆయనెప్పుడూ సౌండ్ తగ్గించమని చెప్పేవారు కాదు. తన పనిపై ఆయనకున్న ఫోకస్ అలాంటిది" అని సచిన్ వివరించారు.

ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఉంటుందని, అది బాహ్య, అంతర్గత ఒత్తిడి అని రెండు రకాలుగా ఉంటుందని పేర్కొన్నారు. నెట్స్‌లో నిరంతరం సాధన చేయడం వల్లే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని స్పష్టం చేశారు. లక్ష్యం వైపు వెళ్లేటప్పుడు ఎన్నో అనుమానాలు వస్తాయని, బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడో ఊహించలేమని, అలాంటి ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగడమే కీలకమని యువతకు సూచించారు.

Sachin Tendulkar
AU Centenary Celebrations
Vizag
Cricket Legend
AP

More Telugu News